Header Banner

ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు! ఎప్పటి వరకు అంటే!

  Sun May 04, 2025 15:51        Education

ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. సప్లిమెంటరీ పరీక్షలు రాయగోరే విద్యార్ధులకు తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఫీజు చెల్లింపు గడువు ఏప్రిల్ 15 నుంచి 22 వరకు చెల్లించవచ్చని పేర్కొంది. అయితే తాజాగా ఫీజు గడువును పొడిగిస్తూ..

 

రాష్ట్ర ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్ధులకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెలలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది. సప్లిమెంటరీ పరీక్షలు రాయగోరే విద్యార్ధులకు తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఫీజు చెల్లింపు గడువు ఏప్రిల్ 15 నుంచి 22 వరకు చెల్లించవచ్చని పేర్కొంది. అయితే తాజాగా ఫీజు గడువును పొడిగిస్తూ ఇంటర్ బోర్డు ప్రకటన ఇచ్చింది. సోమవారం (మే 5) వరకు ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఇప్పటి వరకు ఫీజులు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ఇదే చివరి అవకాశమని, మరోసారి పొడిగింపు ఉండదని ఆమె స్పష్టం చేశారు.

 

ఇది కూడా చదవండి: గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కు అమెరికా ఆదేశాలు! అవి చూపిస్తేనే విమానంలోకి ఎంట్రీ!

 

కాగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12 నుంచి 20 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో పరీక్షలు రోజుకు రెండు సెషన్లలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. అలాగే మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనున్నాయి. అంటే ఉదయం ఫస్ట్ ఇయర్‌, మధ్యాహ్నం సెకండ్ ఇయర్‌ పరీక్షలు జరుగుతాయన్నమాట. ఇక ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మే 28 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయి. ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల పూర్తి షెడ్యూల్‌ ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు.

 

ఇంటర్ ఫస్ట్‌ ఇయర్ సప్లిమెంటరీ టైమ్ టేబుల్ 2025 ఇదే..
మే 12.. సెకండ్‌ లాంగ్వేజ్ పేపర్ 1
మే 13.. ఇంగ్లీష్ పేపర్ 1
మే 14.. మ్యాథ్స్ పేపర్ 1A, బోటనీ పేపర్ 1, సివిక్స్ పేపర్ 1
మే 15.. మ్యాథ్స్ పేపర్ 1B, జువాలజీ 1, హిస్టరీ 1
మే 16.. ఫిజిక్స్ పేపర్ 1, ఎకానమిక్స్ పేపర్ 1
మే 17.. కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1, సోషియాలజీ పేపర్ 1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 1
మే 19.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, లాజిక్ పేపర్ 1, మ్యాథ్స్ బ్రిడ్జ్ కోర్స్ పేపర్ 1 (బైపీసీ విద్యార్థులకు)
మే 20.. మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జాగ్రఫీ పేపర్ 1
ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ సప్లిమెంటరీ 2025 టైమ్ టేబుల్..
మే 12.. సెకండ్‌ లాంగ్వేజ్ పేపర్ 2
మే 13.. ఇంగ్లీష్ పేపర్ 2
మే 14.. మ్యాథ్స్ పేపర్ 2A, బోటనీ పేపర్ 2, సివిక్స్ పేపర్ 2
మే 15.. మ్యాథ్స్ పేపర్ 2B, జువాలజీ 2, హిస్టరీ 2
మే 16.. ఫిజిక్స్ పేపర్ 2, ఎకానమిక్స్ పేపర్2
మే 17.. కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2, సోషియాలజీ పేపర్ 2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 2
మే 19.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, లాజిక్ పేపర్ 2, మ్యాథ్స్ బ్రిడ్జ్ కోర్స్ పేపర్ 2 (బైపీసీ విద్యార్థులకు)
మే 20.. మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 2, జాగ్రఫీ పేపర్ 2

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే! రూ.647 కోట్లతో.. ఆ రూట్‌లో నాలుగ లైన్లుగా! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

 

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #InterSupplementary2025 #APIntermediateBoard #ExamFeeDeadline #LastChanceToPayFee #InterTimeTable2025